మార్కండేయ దేవాలయంలో చండీ హోమం
కరీమాబాద్, ఆంధ్రప్రభ : శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ఈనెల 16 శనివారం ఉదయం చండీ హోమం నిర్వహిస్తున్నామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వడ్నాల మల్లయ్య తెలిపారు. నేడు శనివారం అమావాస్య సందర్భంగా 34 వ డివిజన్ శివనగర్ శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో ఆలయ అర్చకులు ముదిగొండ అభిషేక్ శర్మ, ముక్కు కృష్ణ శర్మ ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో హోమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. చండీ హోమం అనంతరం అన్న ప్రసాద వితరణ కొనసాగుతుందని తెలిపారు.
