ఎన్యూమరేషన్ ఫారాల కోసం ప్రత్యేక సహాయ కేంద్రం

నర్సంపేట, ఆంధ్రప్రభ: ఓటర్ ఎన్యూమరేషన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు నర్సంపేట పట్టణ 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని 9, 10 వార్డుల పరిధిలోని 171, 172 పోలింగ్ బూత్‌ల ఓటర్ల కోసం సంజయ్‌నగర్ పాఠశాల సమీపంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించి, ఫారాలు నింపడంలో సిబ్బంది ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కేంద్రం నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు.

ప్రతి అర్హుడైన ఓటరు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగస్వామి కావాలని, ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని హన్మకొండ శ్రీధర్ కోరారు. ప్రజలకు సరైన సమాచారం అందించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా దరఖాస్తులు పూర్తి చేయించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎల్‌ఓ రమ, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పాల్గొనగా, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.