కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో ని ఐకెపి ఆధ్వర్యంలో ప్రారంభించిన వరి ధాన్యం, మొక్కజొన్న కేంద్రాలను శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం వేసిన ధాన్యాన్ని వెంటనె రైస్ మిల్లుల కు పంపించాలని అధికారులకు సూచించారు. వాతావరణ మార్పులు జరగడంతో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని అన్నారు.

రైతులు పండించిన వరి ధాన్యం 40 కిలోల బరువు మాత్రమే తూకం వేయాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని లింగాపూర్ రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లును తనిఖీ చేసి రైతులు తీసుకవచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కాళీ చేయించాలని రైస్ మిల్లర్ యజమానికి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో, దండేపల్లి తహశీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపిడిఓ జాగర్లమూడి ప్రసాద్, మండల వ్యవసాయ శాఖ అధికారి గోర్ల అంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply