బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద 1వ తరగతి మరియు 5వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఈ. ఇందిరా తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 1వ తరగతికి 41 సీట్లు, 5వ తరగతికి 43 సీట్లు కేటాయించబడినట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు మే 15, 2026 నుంచి జూన్ 6, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఎంపిక చేసిన పాఠశాలలు
- ఆదర్శ హై స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), గారెపల్లి, కాటారం (డే & రెసిడెన్షియల్)
- వివేకానంద హై స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), గారెపల్లి, కాటారం (డే & రెసిడెన్షియల్)
- సెయింట్ పీటర్ హై స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), భూపాలపల్లి
- సువిద్య హై స్కూల్ (ఇంగ్లీష్ మీడియం), గారెపల్లి, కాటారం (డే & రెసిడెన్షియల్)
అర్హతలు
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 లోపు ఉండాలి.
- 1వ తరగతికి దరఖాస్తు చేసే విద్యార్థులు 01-06-2020 నుంచి 31-05-2021 మధ్య జన్మించి ఉండాలి.
- 5వ తరగతికి దరఖాస్తు చేసే విద్యార్థులు 4వ తరగతి స్టడీ సర్టిఫికేట్ జతచేయాలి.
సమర్పించాల్సిన పత్రాలు
- పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
- రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు
- కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు (మీ సేవ ద్వారా జారీ చేయబడినవి)
- రెండు పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోలు
- గత సంవత్సరం మార్కుల మెమో జిరాక్స్ కాపీ
ఆసక్తి గల విద్యార్థులు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం, రూమ్ నెంబర్ F-3, ఐడీఓసీ కలెక్టరేట్, జయశంకర్ భూపాలపల్లిలో దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 6, 2026 సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని సూచించారు.
