టెంపో ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి
టెంపో ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి
మోపిదేవి, ఆంధ్రప్రభ:
మోపిదేవి జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం టెంపో వాహనం బైక్‌పై వస్తున్న యువకుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి పేరు కొప్పుల చందు, అతను ఘంటసాల మండలం జీలగలగండికి చెందినవాడిగా గుర్తించారు. చందు దగ్గర్లో ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
