పవిత్ర సంగమం పూర్వవైభవానికి కృషి…

పవిత్ర సంగమం పూర్వవైభవానికి కృషి…

  • నీటి సంరక్షణ అందరి బాధ్యత
  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
  • కృష్ణమ్మ చెంత స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర
  • పారిశుధ్య కార్మికులకు సత్కారం

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పవిత్ర సంగమం పూర్వవైభవానికి కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే వసంతతో పాటు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసి, పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవిత్ర సంగమం ప్రాంతంలో ఎన్టీటీపీఎస్ సీఎస్ఆర్ నిధులతో మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందిస్తామన్నారు. పవిత్ర సంగంమం అభివృద్ధికి సీఆర్డీయే అధికారులు, స్వచ్చంధ్ర కార్పొరేషన్ చైర్మన్ తో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జలధార -జలహారతి కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలన్నారు.

జలధారతో జలహారతి కార్యక్రమానికి ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలన్నారు. చెరువులు, కుంటలు, కాల్వలు పూడిక తీయాలన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాల మట్టం పెంచాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply