శభాష్ ఉయ్యూరు సిఐ..
శభాష్ ఉయ్యూరు సిఐ..
నిముషాల వ్యవధిలో కుటుంబ సభ్యుల చెంతకు బాలికను అప్పగించిన పోలీసులు
ఉయ్యురు – ఆంధ్రప్రభ : తల్లి తిట్టిందని గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాలికను (15) కేవలం నిమిషాల వ్యవధిలోనే పట్టుకుని తల్లిదండ్రులకు ఉయ్యూరు పోలీసులు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే ఉయ్యురులో నివాసం ఉండే ఒక కుటుంబంలోని బాలిక (15) తల్లి మందలించిందని నెపంతో రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది, విషయం కాసేపు తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాబరా పడుతూ రోడ్ల పైన గాలించడం మొదలుపెట్టారు ఇంతలో డ్యూటీ ముగించుకుని వెళ్తున్న ఉయ్యూరు సీఐ రామారావు వారిని గమనించి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పారు. వెంటనే సీఐ తన సిబ్బంది అందర్నీ పిలిపించుకుని నలువైపులా గాలించటం, అలానే స్థానిక మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
వారి ప్రయత్నాల ఫలించి 15 నిమిషాల్లోనే రిలయన్స్ మార్ట్ వెనుక వైపు ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో చీకట్లో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగింది. ఆ ప్రదేశం తాగుబోతులతోనూ, విచ్చలవిడిగా తిరిగే కుర్రాళ్ళతోనూ ఉండే ఆ ప్రదేశంలో నుండి బాలికకు వెంటనే స్పందించి ఎటువంటి హాని జరగకుండా సురక్షితంగా ఇంటికి చేర్చిన ఉయ్యూరు పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. పిల్లలపై మహిళలపై జరిగే లైంగిక నేరాల విషయంలో ఉయ్యూరు సిఐ రామారావు నిరంతరం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు అనే నేపథ్యంలో, గత సంవత్సర కాలంగా ఉయ్యూరు టౌన్ లో ఆ నేరాలు చాలా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
