ప్రశాంతంగా టీజీఎస్‌డబ్ల్యూఆర్ జేసీ సెట్-2026 పరీక్ష

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో శుక్రవారం టీజీఎస్‌డబ్ల్యూఆర్ జేసీ సెట్-2026 (COE, Non-COE) ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు.

పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సి.హెచ్. శకుంతల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో మొత్తం 374 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 208 మంది బాలికలు, 109 మంది బాలురు పరీక్ష రాశారు.

అలాగే 33 మంది బాలికలు, 24 మంది బాలురు గైర్హాజరైనట్లు తెలిపారు. మొత్తం 317 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, హాజరు శాతం 84.7 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు.

పరీక్షల నిర్వహణ కోసం 16 తరగతి గదులను కేటాయించామని, ప్రతి గదిలో 24 మంది విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించినట్లు పరీక్షా కేంద్రం సి.ఎస్. సి.హెచ్. శకుంతల వెల్లడించారు.

Leave a Reply