Hyderabad dating apps | డేటింగ్ యాప్ వినియోగంలో హైదరాబాద్‌కు రెండో స్థానం

Hyderabad dating apps | డేటింగ్ యాప్ వినియోగంలో హైదరాబాద్‌కు రెండో స్థానం

Hyderabad dating apps | గ్లీడెన్ యాప్‌లో మహిళల సంఖ్య భారీగా పెరుగుదల
ప్రొఫెషనల్స్‌పై మహిళల ఆసక్తి పెరుగుతోంది
డేటింగ్ యాప్‌లతో మారుతున్న నగర జీవనశైలి

Hyderabad dating apps | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: గోప్యమైన ఆన్‌లైన్ డేటింగ్‌లో హైదరాబాద్ సత్తా చాటుతోంది. ఈ డేటింగ్ యాప్‌లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచి, మొత్తం వినియోగదారుల్లో దాదాపు 18 శాతం మంది అక్కడి వారేనని సమాచారం. ఇక ఐటీ అడ్డా హైదరాబాద్ 17 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ, ముంబై, పుణే నగరాల్లో కూడా ఈ ప్లాట్‌ఫామ్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది.

డేటింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన గ్లీడెన్‌లో ఇప్పటికే 40 లక్షల మందికి పైగా భారతీయులు చేరారు. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రకారం, దీని వినియోగదారులలో సుమారు 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే ఆసక్తికరంగా గత రెండు సంవత్సరాల్లో ఈ యాప్ మహిళల వినియోగం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

తాజా డేటింగ్ యాప్ సర్వే ప్రకారం, చాలా మంది పురుషులు 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతులను కోరుకుంటున్నారని, మహిళలు సాధారణంగా 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే పురుషులను ఇష్టపడుతున్నారని తేల్చారు. డేటింగ్ యాప్ వాడకంలో మహిళలు విపరీతంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.

హైదరాబాద్‌లో వివాహేతర సంబంధాల సర్వే, గ్లీడెన్ డేటింగ్ యాప్ నివేదికలు డేటింగ్ యాప్‌ల వల్ల మారుతున్న జీవనశైలి, వివాహ వ్యవస్థపై టెక్నాలజీ ప్రభావం వంటివాటిని అంచనా వేశాయి. ఈ సర్వే నివేదికలో డేటింగ్ యాప్‌ల వినియోగదారుల ప్రవర్తనలో కూడా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సభ్యులు రోజుకు సగటున ఒకటి నుంచి గంటన్నర వరకు చాట్లలో గడుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య, అలాగే రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువ ఆన్‌లైన్ యాక్టివిటీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడిన ప్రొఫెషనల్స్, డాక్టర్లు, ఉన్నతాధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వారిపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.