ఉత్సహంగా కరాటే సెలక్షన్లు
ఉత్సహంగా కరాటే సెలక్షన్లు
గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) కరాటే సెలక్షన్స్ లు ఇక్కడ ఈ రోజు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్స్ పట్టణంలోని సింగరేణి ఆర్సీఓఏ క్లబ్లో ఉత్సహభరితంగా జరుగుతున్నాయి.
కరాటే సెలక్షన్స్, టోర్నమెంట్ను రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మల్లేశం మాట్లాడారు. విద్యార్థి దశ నుండి శారీరకదా ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు ఆత్మ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం(State Govt) విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణ ఇప్పిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి(State Government, State Level, National Level)లో తమ ప్రతిభ చాటాలని జిల్లా విద్యార్థులను కో్రారు.
ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా ఎస్జీఎఫ్ సెక్రెటరీ కనుకుంట్ల లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్, శోభ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెక్రెటరీ తగరపు శంకర్, స్టేట్ సీనియర్ రెఫరీ రచ్చ శ్రీనివాస్(Racha Srinivas), భవాని, జిల్లా కరాటే అసోసియేషన్ ప్రతినిధులు తౌడబోయిన రాజ్ కుమార్ , కొయ్యడ శ్రీనివాస్ యాదవ్ ,సీనియర్ మాస్టర్స్ వడ్డేపల్లి సురేష్, కరాటే శ్రీనివాస్, పసునూటి శంకర్, చందు, వడ్డేపల్లి షైనీ,లక్ష్మణ్, మంతిని కొండ్ర నాగరాజు(Kondra Nagaraju), సురభి వేణుగోపాల్, మన్నన్, జగిత్యాల పవన్, సురభి అన్వేష్ ,జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఐల విజయ్ కుమార్, జావిద్, ఖాజాబీ, శ్రీనివాస్ తో పాటు పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల(Jagityala Sirisilla) జిల్లాలకు చెందిన వందలాది మంది కరాటే క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు.
