Digital | పైరసీ భూతం మ‌ళ్లీ వ‌చ్చేసింది

Digital | పైరసీ భూతం మ‌ళ్లీ వ‌చ్చేసింది

కొత్త మూవీల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న‌పైర‌సీ సైట్
వెబ్‌సైట్ పునరుద్ధర‌ణ‌తో సినీ పెద్ద‌ల విస్మ‌యం
సాంకేతికతను వాడుకుంటూ డొమైన్లను మారుస్తున్న ముఠా
నెట్‌వర్క్‌ను ఛేదించడం పోలీసుల‌కు స‌వాల్‌

Digital | సినిమా డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : టాలీవుడ్‌ను పైరసీ భూతం మళ్లీ వెన్నాడుతోంది. ఒకవైపు డిజిటల్ విప్లవం, మరోవైపు పైరసీ సైట్ల దాడితో కుదేలవుతున్న చిత్ర పరిశ్రమకు ఐబొమ్మ రూపంలో మరో భారీ షాక్ తగిలింది. ఈ సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి అరెస్ట్ కావడంతో ఇక ఐబొమ్మ అధ్యాయం ముగిసిందని అంతా భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా రవి బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఆన్‌లైన్‌లో మళ్లీ ఈ సైట్ ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

గతంలో ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పైరసీకి అడ్డుకట్ట పడుతుందని నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో సైట్ పూర్తిగా నిలిచిపోయింది. అయితే, తాజాగా వెబ్‌సైట్ పునరుద్ధరించబడటమే కాకుండా, థియేటర్లలో ఉన్న కొత్త సినిమాలు సైతం అందులో ప్రత్యక్షమవ్వడం పట్ల సినీ పెద్దలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రవి బెయిల్‌పై రావడం, వెంటనే సైట్ ఆపరేషన్లు మొదలవ్వడం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. సాంకేతికతను వాడుకుంటూ డొమైన్లను మారుస్తూ వస్తున్న ఈ పైరసీ ముఠాను అరికట్టడంలో ఎక్కడ లోపం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఇప్పుడు పోలీసులు మ‌ళ్లీ ర‌వి కోసం వేట మొద‌లు పెట్టారు..

CLICK HERE TO READ MORE : Esther anil| ఈస్త‌ర్ అనిల్ రొమాంటిక్ లుక్స్

CLICK HERE TO READ MORE

Leave a Reply