prime minister | అలాగే ఎస్కార్ట్, భ్ర‌ద‌త సిబ్బంది కూడా కుదింపు

prime minister | అలాగే ఎస్కార్ట్, భ్ర‌ద‌త సిబ్బంది కూడా కుదింపు

prime minister | సాధ్య‌మైనంతవ‌ర‌కు ఈవీ వాహనాలు ఉండాల‌ని సూచ‌న
మోదీ బాట‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా..

prime minister | న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్నాయి. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని మోదీ సూచించారు. బంగారాన్ని కొనకుండా ఉండాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతులను అవలంబించాలని, దేశీయ లేదా అంతర్జాతీయ అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు చివరికి వంటనూనె వినియోగాన్ని సైతం తగ్గించుకోవాలని సూచించారు. ఈ పరిణామాల మధ్య ఆయన అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. తన కాన్వాయ్ పరిమాణాన్ని 50శాతం తగ్గించాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ ఆదా, విస్తృత ఆర్థిక పొదుపు చర్యలలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఇరాన్ యుద్ధంతో ముడిపడి ఉన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని స‌మాచారం. ప్రధాని కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు సూచనలు జారీ అయ్యాయి. తప్పనిసరి భద్రతా నిబంధనలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూసుకోవాలని మోదీ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఎస్పీజీ ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రధాని మోదీ కోరారు. దీని కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయరాదని చెప్పారు.

యూపీ ముఖ్య‌మంత్రి కూడా..
కాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ బాట ప‌ట్టారు. త‌న‌తో పాటు మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీ వాహన కాన్వాయ్‌లను 50 శాతం తగ్గించాలని ఆయన ఆదేశించారు. ఆ దిశగా తాజా ఆదేశాలను ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా అధికారిక వాహనాల వినియోగాన్ని, భద్రతా సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. పొదుపునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా యోగి ఆదిత్యనాథ్ కోరారు. ఉత్తర ప్రదేశ్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న‌ అన్ని కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కల్పించాల్సి ఉంటుంది. దీని ప్రభావం గ్రేటర్ నొయిడాపై పడొచ్చు. ఇక్కడి ఐటీ హబ్ మొత్తం కూడా బోసి పోవచ్చు. దీంతో పాటు పీఎన్‌జీ, మెట్రో సేవలు, ప్రభుత్వ రవాణా వ్యవస్థల వినియోగానికి ఆయన ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు యోగి ఆదిత్యనాథ్. సదస్సులు, ప్రభుత్వ సమావేశాలు, సెమినార్లు వంటి కార్యక్రమాలను కూడా వర్చువల్‌గా నిర్వహించాలని సూచించారు.

CLICK HERE TO READ Tn Cm 1st Foul : ఫస్ట్​ స్ట్రోక్​.. Andhra Prabha Top Story

CLICK HERE TO READ MORE

Leave a Reply