డిజిటల్ డోర్ నెంబర్లతో విప్లవాత్మక మార్పు..

డిజిటల్ డోర్ నెంబర్లతో విప్లవాత్మక మార్పు..

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబర్ల ద్వారా పౌర సేవల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నోడల్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లు, అడ్మిన్, ప్లానింగ్, అమినిటీస్ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. డిజిటల్ డోర్ నంబర్ల ద్వారా ప్రతి ఇంటికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ అనుసంధానమవుతుందని, దీని ద్వారా ఆస్తి వివరాలు, పన్ను చెల్లింపులు, నీటి సరఫరా, ట్రేడ్ లైసెన్స్, పౌర సేవలకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే వ్యవస్థలో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా పౌర సేవలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటికే చేరుతాయని ఆయన పేర్కొన్నారు.

దీని కోసం నియమించిన నోడల్ ఆఫీసర్లు, మాస్టర్ ట్రైనర్లు సమర్థవంతంగా పనిచేసి, అడ్మిన్, ప్లానింగ్, అమినిటీస్ కార్యదర్శులతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జీ సిటి ప్లానర్ వై.వి. వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply