11 o’clock : గవర్నర్ తో ముగిసిన భేటీ

11 o’clock : గవర్నర్ తో ముగిసిన భేటీ

11 o’clock : ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అధికారిక అనుమతి ఇచ్చారు.

ఈ ఉదయం 11 గంటలకు విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం తన వద్ద ఉందని వివరించారు. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సస్పెన్స్‌కు దీంతో ముగింపు పలికినట్టైంది.

తమిళనాడులో కరుణానిధి, జయలలిత తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగిన విజయ్ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతుండటం రాజకీయంగా సంచలనంగా మారింది. టీవీకే శ్రేణులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.