ipl 2026 today match |ఇవాళ లక్నో, బెంగళూర్ ఢీ
ipl 2026 today match |ఇవాళ లక్నో, బెంగళూర్ ఢీ
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ 50వ మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోడానికి సిద్ధమయ్యాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ మంచి విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉంది. లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది, ఇక్కడ సగటు స్కోరు 150-160 లోపు ఉంటుంది.
ఐపీఎల్ చరిత్రలో లక్నో, బెంగళూర్ మధ్య మొత్తం 7 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఆర్సీబీ 5 గెలిస్తే, లక్నో 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. బెంగళూర్ జట్టులో విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. లక్నో పిచ్ నెమ్మదిగా ఉన్నందున, ఛేజింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాచ్ లైవ్ జియో సినిమాలో చూడవచ్చు.
