Tandur-Kotpalli Highway | తాండూరు–కోటపల్లి హైవే అభివృద్ధికి శ్రీకారం

143.53 కి.మీ మేర 8 రహదారుల పనులు
వికారాబాద్ జిల్లా తాండూరులో శంకుస్థాపన చేసిన మంత్రి బృందం
రోడ్ల అభివృద్ధితో ప్రాంతీయ రవాణాకు మరింత ఊతం

Tandur-Kotpalli Highway | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో తాండూరు–కోటపల్లి హైవే అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. మొత్తం రూ.345.88 కోట్ల వ్యయంతో 143.53 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్న 8 హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల నిర్మాణ పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రహదారి అభివృద్ధి పూర్తయితే తాండూరు, కోటపల్లి ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు స్థానికంగా వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ డా. పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలె యాదయ్య తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.