ప్రకృతి వ్యవసాయంతో భూమి ఆరోగ్యాన్ని కాపాడగలం
ప్రకృతి వ్యవసాయంతో భూమి ఆరోగ్యాన్ని కాపాడగలం
చిట్యాల, ఆంధ్రప్రభ: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం ద్వారానే భూమి ఆరోగ్యాన్ని కాపాడగలమని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. నీరజ పేర్కొన్నారు. బుధవారం ఆమె చిట్యాల మండల పరిధిలో ఉన్న గుండ్రాంపల్లి, సుంకెనపల్లి గ్రామాలను సందర్శించారు. గత ఏడాది నవంబర్లో నియమించబడిన ఈసీఆర్పీల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను స్వయంగా సందర్శించి, పంటల సాగు విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ వై ఎస్ ఎస్ టీమ్ లీడర్ శ్రీ హుమాయున్, యశ్వంత్ రెడ్డి, ఈసీఆర్పీలు రవితేజ, కోటేశ్వరరావు పాల్గొన్నారు. రైతులు మైల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
