బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
గట్టుప్పల, ఆంధ్రప్రభ: గట్టుప్పల మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన బానవత్ బిక్కు(56) మంగళవారం అకాల మరణం చెందారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, తేరటుపల్లి మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం గౌడ్ బాధిత కుటుంబానికి రూ.10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షులు మాధగోని వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ నేనవత్ బంతిలాల్, మాజీ సర్పంచ్ మాధగోని శేఖర్, పూసపాటి శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.
