బోరుగుంతలో పడి వ్యక్తి మృతి..

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ ; మండలంలోని ఊట్లపల్లి గ్రామ శివారులో గల వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు శనివారం బోరు గుంతలో నాలుగేళ్ల బాలుడు పడిపోయాడు.​బాలుడిని కాపాడేందుకు వెళ్లిన తాత వెంకన్న అదే బోరు గుంతలో ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు ​రెస్క్యూ ఆపరేషన్ చేశారు. బోరు గుంతలోంచి తాత,మనవడిని బయటకు తీశారు. అయితే ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న(53) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. బోరు గుంత ప్రమాదంలో వెంకన్న మరణించడంతో ఊట్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.

Leave a Reply