ఆ.. నలుగురు నిందితులు అరెస్టు..

ఆ.. నలుగురు నిందితులు అరెస్టు..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్గేట్ వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 60.685 కిలోల ఎండు గంజాయిని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ ఎక్సైజ్అధికారి ఎం. విష్ణుమూర్తిల ఆదేశాల మేరకు ఆప్కారి శాఖ పోలీసులు పట్టుకున్నారు. రామన్నపేట, మోత్కూర్ సిఐ లు ఆర్ బాళోజి నాయక్, కె. రవిచంద్ర రెడ్డిల ఆధ్వర్యంలో పంతంగి టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా దానిలో 60.685 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.

మహారాష్ట్రకు చెందిన గంగాబాయ్ పాండు రంగ్ చౌహన్, కమల్ అర్జున్ మోహితే, విజయ్ ఆసరం గోరపడే, నల్లగొండకు చెందిన వల్లపుదాసు వేణుకుమార్ లు గంజాయిని ఒడిశా రాష్టంలోని బరంపూర్ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుండి రూ. 25 లక్షల విలువైన గంజాయి, 1 ఆటో , 2 సెల్ ఫోన్ లు, నలుగురు ముద్దాయిలను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్ కి తరచించారు. ఈ తనిఖీలలో ఎస్ లు ఎన్ శంకర్, బి శివ కృష్ణ, పి సత్యనారాయణ, కానిస్టేబుల్స్ తిరుమలేష్, రావొజీ, రహమాన్, రమేష్ రెడ్డి, కృష్ణ రెడ్డి, గోపి, అనిల్, వెంకట్, సోనీ, స్వప్నలు పాల్గొన్నారు.

Leave a Reply