జిల్లాలో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్…
జిల్లాలో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్…
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నరసరావుపేట సబ్ డివిజన్ నరసరావు పేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని బీసీ కాలనీ నందు నరసరావు పేట సబ్ డివిజన్ DSP M.హనుమంత రావు పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి *ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను, సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా… ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీ లలో బీసీ కాలనీ* నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు -24, ఆటో – 01 స్వాధీనం చేసుకున్నారు. ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ బీసీ కాలనీ లోని ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

హెల్మెట్ వాడకం గురించి,గ్రామంలోని పరిస్థితుల గురించి డి.ఎస్.పి M. హనుమంతరావు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించారు.కాలనీలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నట్లయితే 112 కు కాల్ చేయాలని తెలిపారు.రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు DSP తెలిపారు. అంతేకాకుండా… రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు, పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కేసుల నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

కాలనీ లో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,కాలనీ లో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీసీ కాలనీ* నందు జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో గురజాల సబ్ డివిజన్ DSP M.హనుమంత రావుతో పాటు నరసరావుపేట 2వ పట్టణ CI ప్రభాకర్, చిలకలూరిపేట పట్టణ CI రమేష్, SI లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
