ipl5may | ఇవాళ ఐపీఎల్‌లో ముంబై, ల‌క్నో ఢీ

ipl5may | ఇవాళ ఐపీఎల్‌లో ముంబై, ల‌క్నో ఢీ

ipl5may | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 భాగంగా ఇవాళ బిగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంట‌ల‌కు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్‌ 47వ మ్యాచ్ జరగనుంది. జియోసినిమా యాప్/వెబ్‌సైట్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. ఈ ఐపీఎల్‌లో రెండు జట్ల ఆట‌తీరు చాలా దారుణంగా ఉంది. విజ‌యాలు సాధించ‌డంలో వెనుక‌బ‌డ్డాయి. దీంతో దాదాపు ప్లేఆఫ్ ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. పాయింట్ల పట్టికలో అడుగున 9, 10 స్థానాల్లో ఉన్నాయి. ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు కీలకం. గెలిచినా ప్లేఆఫ్స్‌కు వెళ్తాయ‌నే న‌మ్మ‌కం లేదు. ఇత‌ర జ‌ట్ల జ‌య‌ప‌జ‌యాల మీద ఆధార ప‌డాల్సి వ‌స్తుంది. ముంబై ఇండియన్స్ జ‌ట్టు కీల‌క ఆట‌గాడు రోహిత్ శర్మ గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. ఇది ఆ జ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావం చూపించింది. ఈ మ్యాచ్‌కి కూడా అందుబాటులో ఉంటారో లేదో స్పష్టత లేదు.

లక్నో సూపర్ జెయింట్స్ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. కొన్ని మ్యాచులు గెలిచినా త‌ర్వాత అంత‌గా రాణించ‌లేక‌పోతోంది. ఆ జ‌ట్టులోని కీల‌క ఆట‌గాళ్లు పంత్‌, పూర‌న్ స‌రిగా ఆడ‌లేక‌పోతున్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్ జోష్ ఇంగ్లిస్ అందుబాటులో ఉంటే నికోలస్ పూరన్ స్థానంలో ఆడించే అవకాశం ఉంది.

Leave a Reply