Amaravathi | మంత్రి సంధ్యారాణి గ‌న్ మెన్ పై సస్సెన్ష‌న్ వేటు

వెల‌గ‌పూడి – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ వాహనం గన్‌మెన్‌ జీవీ రమణపై సస్పెన్షన్‌ వేటు పడింది.. రమణ డ్యూటీ దిగి ఇంటికి వెళ్తుండగా బ్యాగ్ మాయమైంది. అందులో 30 బుల్లెట్లతో గన్ మ్యాగ్‌జైన్‌ ఉండటం పోలీసు శాఖలో కలకలం రేపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి గాను నేడు రమణను విధుల నుంచి సస్పెండ్ చేశారు పార్వతీపురం జిల్లా ఎస్పీ.. పార్వతీపురం మన్యం జిల్లాలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రమణ.. మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనంలో గన్‌మన్‌గా ఉన్నారు. రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు.

అయితే, గురువారం ఉదయం తన వద్ద ఉన్న రైఫిల్‌ను పార్వతీపురం జిల్లా కేంద్రంలో అప్పగించారు. ఎప్పుడూ తన వెంట ఉండే సంచిలో భద్రపరిచిన బుల్లెట్లున్న మ్యాగ్‌జైన్‌ ను మాత్రం అప్పగించలేదు. విజయనగరం సమీప గ్రామానికి చెందిన రమణ.. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కూడలి వద్దకు వ్యక్తిగత పనులపై వెళ్లారు.. తనకు పరిచయమున్న ఆటోడ్రైవర్‌తో మాట్లాడి, కలక్టరేట్ వద్ద గల డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో తన చేతిలో సంచిని కింద పెట్టి, పనిలో పడిపోయారు.. తర్వాత చూస్తే.. తీరా సంచి కనిపించకపించలేదు. అందులో 30 బుల్లెట్లు ఉన్నాయంటూ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బ్యాగ్ కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీ లను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాగ్ ఆచూకీ లభించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *