సిమ్మింగ్ ఫుల్ లు కొలనులతో యువకులు ఎంజాయ్..

సిమ్మింగ్ ఫుల్ లు కొలనులతో యువకులు ఎంజాయ్..
- భానుడిప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం…
- సిమ్మింగ్ ఫుల్ వద్ద కొలనులతో ఉపశమనం.
- తీవ్ర ఎండకు రహదారులు రహదారులు,
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఎన్నడూ లేని విధంగా భానుడి తీవ్ర ప్రతాపం చూపించడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గత 15 రోజుల నుండి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎండలవేడిమితో ఉదయం 10 గంటలకే ఎండలు మండుతుండడంతో వృద్ధులు, చిన్నారులు, ప్రజలు,ఇళ్ళకే పరిమిత మవుతున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలో ఆదివారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో జనం ఒక్కరి బిక్కిరి అవుతున్నారు.

ఎండల వేడిమిని తట్టుకోలేక చెట్లు ఇండ్లకే పరిమిత మవుతున్నారు. వేసవి ప్రతాపానికి సేద తీర్చుకునేందుకు యువకులు, చిన్నారులు సిమ్మింగ్ పూల్ వద్ద ఈత కొలనుల వద్ద మధ్యాహ్నం కాస్త ఉపశమనం పొందుతున్నారు.పాఠశాల లకు వేసవి సెలవుల తో పాటు ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉండటంతో భీమ్‌గల్, పురాణిపేట్, ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద యువకులు, చిన్నారులు ఈత కొట్టేందుకు భారీగా తరలివచ్చి సేద తీర్చుకుంటున్నారు.ఎండల వేడిమికి మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకురావడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల వేడిమిని తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. బాలుడి ప్రతాపానికి ఉపశమనం కలిగేందుకు కొబ్బరి బొండం శీతల పానీయాలు సేవిస్తూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలతో పాటు వివిధ పనులు చేసే కార్మికులు కూలీలు గత వారం రోజులు నుండి ఎండల వేడిమికి తెల్లవారుజామున పనులకు వెళ్లి మధ్యాహ్నం లోపు ఇంటికి తిరిగి వస్తున్నారు.
గత పక్షం రోడ్ల నుండి బాలుడి ప్రతాపం తీవ్రవరూపం దాల్చడంతో జనం తీవ్ర గా తల్లడిల్లుతున్నారు. రానున్న మరికొన్ని రోజుల్లో ఎండ తీవ్రత ఇలాగే ఉండే పరిస్థితి దీనికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటూన వైద్యులు లేని పక్షంలో వడదెబ్బ తగిలి అనారోగ్యాలకు పాలవుతారు జాగ్రత్త తప్పనిసరి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
