మానసిక ప్రశాంతత యోగతో సాధ్యం..

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వానికి యోగ దివ్య ఔషదంలా పని చేస్తుందని భీంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హెచ్. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ బీ. సుమలత అన్నారు. మంగళవారం డీగ్రీ కాలేజీ లో యోగ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు జరిపారు. యోగాను ప్రతి ఒక్కరు జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు. విద్యతో పాటు ఆరోగ్యానికి స్టూడెంట్స్ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యా వారోత్సవాలు స్టూడెంట్స్ అభివృద్ధి కి దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

Leave a Reply