దళారులకు అడ్డాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

దళారులకు అడ్డాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

  • బిఆర్ఎస్ నేత నిమ్మల నవీన్ రెడ్డి

మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలు దళారులకు అడ్డగా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు నిమ్మల నవీన్ రెడ్డి ఆరోపించారు.బుధవారం మాడ్గులపల్లి మండలం సీత్యా తండా గ్రామపంచాయతీలో వేములపల్లి పిఎసిఎస్ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అయన సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల సమస్యలనుఅడిగితెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు దళారులకు అడ్డగా మారాయని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బస్తాకు 40 కిలోల 700 గ్రాములు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో బస్తాకు 42 కిలోలు తూకం వేస్తూ గిరిజన రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. ధాన్యం కొలుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యా లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని నెలల తరబడి దాన్యం పోసినప్పటికీ కాంటాలు వేయకపోవడంతో, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు అవసరమైన లారీలు రాకపోవడంతో, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమను ఆదుకునే దిక్కు ఎవరు లేరని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు.

కాంటాలు వేసి మిల్లులకు ఎగుమతి చేసిన ధాన్యాన్ని దిగుమతి చేసుకునే సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది మిల్లర్లు కుమ్మక్కై రైతులు నుండి బస్తాకు ఒక కేజీ ధాన్యం ఖరీదు డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, రైతులు గత్యంతరం లేక దిక్కుతోచని పరి స్థితులలో నగదు చెల్లించి వస్తున్నారన్నారు. రైతుల నుండి బలవంతంగా వసూలు చేస్తున్న రూపాయలు ఎవరి ఖాతాలకు వెళ్తున్నాయో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించి, కొనుగోళ్లను వేగవంతంచేసిఎప్పటికప్పుడు మిల్లులకుఎగుమతిచేయాలని అయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మండలంలోని రైతులతో సమీకరించి బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడ తామనిఆయనహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమారాణివెంకన్న,గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మాడ్గుల చుక్కయ్య, బాణావత్ సతీష్, కుమార్, మంగమ్మ, సరస్వతి, రవి, సక్రం,జబ్బార్,సంతోష్,సితారములు,కాసుల రమణ, వల్లపుదాసు చంద్రశేఖర్,తదితరులు పాల్గొన్నారు.