వైభవంగా గిరిప్రదక్షిణ
వైభవంగా గిరిప్రదక్షిణ
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో నరసింహస్వామి జయంతి సందర్భంగా భక్తి వాతావరణం నెలకొంది. స్వాతి నక్షత్రం పురస్కరించుకుని, బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి వారి గుట్ట చుట్టూ గ్రామ ప్రజలు ఘనంగా గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం వేళ నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని భజనలు, నామస్మరణలతో గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశారు. భక్తులు స్వామి వారి చిత్రపటాన్ని మోసుకుంటూ, కుటుంబ సమేతంగా పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
