129th Birthday | ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు

129th Birthday | ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు

129th Birthday | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో స్థానిక నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు దీప శ్యాంసుందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్ హిందూఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ జననమే తప్ప మరణం తెలియని వీరుడు దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని దేశం నలుమూలల వినిపించి స్వాతంత్ర్య ఉద్యమానికి వేలాది మంది సైనికులని ఏర్పాటు చేసి భారతవనీలో దేశభక్తిని రగిలించి ఆజాద్ హిందూ ఫౌ్జ్ దళాన్ని స్థాపించి ఆంగ్లేయులు గుండెల్లో వణుకు పుట్టించిన భారతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ అన్నారు.

ఆయన దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ముదిగొండ మహేష్, ఉపాధ్యక్షుడు రాచర్ల ఈశ్వర్, గ్రామ ఉపసర్పంచ్ మీసాల నరసింహ్మ, మాజీ అధ్యక్షుడు ఈడ్దుల ఐలయ్య యాదవ్, మునుకుంట్ల నర్సింహ్మ గౌడ్, ఈడ్దుల హరిప్రసాద్, పబ్బు శ్రీనివాస్ గౌడ్, మొగిలి మహేందర్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శులు ఈడ్దుల మస్తాన్ బాబు యాదవ్, నెళ్ళికంటి హరిప్రసాద్, వార్డు మెంబర్ ఈడ్దుల ఇంద్రసేన యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply