573 మార్కులు పొందిన చైతన్యకు సన్మానం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని ఏకశిలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పదవ తరగతి ఫలితాలలో 573 మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిన బి చైతన్యను పాఠశాల యాజమాన్యం అభినందించి సత్కరించింది. వైష్ణవి( 570), నిఖిత( 569), అఖిల్( 567) తో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కూడా యాజమాన్యం ప్రశంసించింది. హైస్కూల్ ప్రిన్సిపల్ సి ఇందిర, సెక్రటరి సి ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్ సి సాయి నికేతన్ రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
