ములుగు నూతన కలెక్టర్‌ను కలిసిన సింగరేణి జీఎం

ములుగు నూతన కలెక్టర్‌ను కలిసిన సింగరేణి జీఎం
భూపాలపల్లి–ములుగు ప్రాజెక్టులపై చర్చ..
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ భోర్కడేను సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి, ములుగు ఏరియాల్లో కొనసాగుతున్న సింగరేణి ప్రాజెక్టులు, విస్తరణ పనులు, భూసంబంధిత సమస్యలపై కలెక్టర్‌కు వివరాలు అందించారు.
దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భూమి సంబంధిత సమస్యలను చట్టపరమైన విధానాల ప్రకారం వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సింగరేణి ప్రాజెక్టులు జిల్లా ఆర్థికాభివృద్ధికి కీలకమని పేర్కొన్న కలెక్టర్, అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఏరియా ఎస్టేట్ అధికారులు కార్తిక్, శశాంక్ పాల్గొన్నారు.
