పెట్రోల్,గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు

పెట్రోల్,గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు
తొర్రూరు, ఆంధ్రప్రభ: పెట్రోల్,గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ డీటీ పెనక సత్యనారాయణ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని పలు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలలో డీసీఐసీ జిల్లా చైర్మన్ వింజమూరి సుధాకర్ తో కలిసి పౌర సరపరాల శాఖ డీటీ తనిఖీ చేశారు. బంకుల్లో ఇంధన నిల్వలు, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంధనం కోసం వచ్చిన వినియోగదారులతో ముఖాముఖి మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రజలు అపోహలకు లోనుకావద్దని, పెట్రోల్ బంకుల్లో సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆయిల్ కంపెనీ వారిని సంప్రదించి స్టాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించవద్దని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేయాలన్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
