మెడిసిటిలో డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు

మెడిసిటిలో డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు

​- నార్కోటిక్స్, మహిళా రక్షణపై విద్యార్థులకు పోలీసుల దిశానిర్దేశం

-పాల్గొన్న ఈగల్ పోలీస్ విభాగం ఉన్నతాధికారులు

​మేడ్చల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్న ఈగల్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఘన్‌పూర్ లోని మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ మహిళా రక్షణ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

​ఈ కార్యక్రమానికి ఈగల్ పోలీస్ విభాగం సూపర్నింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) పి. సీతారాం నేతృత్వం వహించగా, డీఎస్పీ కె. సైదులు, ఇన్స్ పెక్టర్ శ్రీ పి. శ్రీనివాస రావులు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగించినా లేదా విక్రయించినా కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండటం ద్వారానే వీటి బారిన పడకుండా ఉండగలమని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, విద్యార్థినులు ఏదైనా వేధింపులకు గురైతే భయం వీడి వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడిసిటి ప్రిన్సిపాల్ డా. దేవేంద్ర సింగ్ నేగి, వైస్ ప్రిన్సిపాల్ డా. శైలేంద్ర, కళాశాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థి, విద్యార్థిణులు పాల్గొన్నారు.

Leave a Reply