పోష్ చట్టంపై అవగాహన ఎంతో అవసరం

పోష్ చట్టంపై అవగాహన ఎంతో అవసరం
జైనూర్, ఆంధ్రప్రభ : పోస్ట్ చట్టంపై మహిళలకు అవగాహన ఎంతో అవసరమని, మహిళలు కల్పిస్తున్న చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జైనూర్ ఎస్ఐ రవికుమార్ అన్నారు.బుధవారం కొమురం భీ0 ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ప్రభుత్వ వివిధ శాఖల లో పనిచేస్తున్న మహిళల ఉద్యోగులతో పోష్ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రవికుమార్ సిడిపిఓ ఇందిరా, జైనూర్ ప్రభుత్వాసుపత్రి వైద్య అధికారి నాగర్ గొంజ్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలపై చట్టపరమైన నిబంధనలు ఫిర్యాదు విధానం, మహిళల హక్కులపై వివరంగా అవగాహన కల్పించారు.
మహిళా ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు ఇబ్బందులకు గురి చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. మహిళలకు కల్పించే హక్కులు భద్రత విశాలంపై ప్రతి మహిళ తో పాటు మహిళా ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని వారు కోరారు. మహిళా ఉద్యోగులపై ఏ ఉద్యోగులైన ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేసినట్లయితే నేరుగా సంబంధిత శాఖల అధికారులకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వారు కోరారు. ఈ అవగాహన సమావేశంలో మండల పరిషత్ వైద్య ఆరోగ్యశాఖ ఐసీబీఎస్ తదితర శాఖల పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.
