పదవ తరగతి విద్యార్థులకు పోలీస్ శాఖ ప్రోత్సాహం….

పదవ తరగతి విద్యార్థులకు పోలీస్ శాఖ ప్రోత్సాహం….

జై నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని పరిస్థితి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రాసుకోవడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహం కల్పిస్తుందని అసిఫాబాద్ ఏ ఎస్ పి చిత్తరంజన్ అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని బాలికల అశ్రమో న్నత పాఠశాలలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా జైనూర్, సిర్పూర్ (యు) లింగాపూర్ మండలాల్లో ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరీక్షల ప్యాడ్లు పెన్నులు వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పరీక్షా సామాగ్రి వాటర్ బాటిల్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలని ఆయన కోరారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పోలీసు శాఖ ద్వారా ప్రోత్సాహంగా మూడు మండలాల్లోని 750 పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.

ఎండల తీవ్రత కారణంగా పరీక్షలు రాసే విద్యార్థులకు 2500 వాటర్ బాటిల్లు, 10,000 పెన్నులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసి ఉత్తమఫలితాలుసాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎస్పీకి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, పోచం లొద్ది ప్రధానోపాధ్యాయులు భీమ్రావు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్, ఎంఈఓ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply