మండల టాపర్ గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

మండల టాపర్ గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈఫలితాల్లో కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన సిరిగిరి శాలిని కమ్మర్ పల్లి మండల టాపర్గా నిలిచింది.ఈ సందర్భంగా మండల విద్యా వనరుల అధికారీ ఎన్.ఆంధ్రయ్య మాట్లాడుతూ కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ జెడ్పీ హెచ్‌ ఎస్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న శాలిని కి 600 మార్కులకు గాను 568 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచినట్లు తెలిపారు.

కోనా సముందర్ జడ్పి హెచ్ఎస్ పాఠశాల విద్యార్థి జి. అభినయ్ ద్వితీయ స్థానం,కమ్మర్ పల్లి జడ్పి హెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని జె. శ్రీజ తృతీయ స్థానం సాధించినట్లు ఆయన వెల్లడించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థులను అభినందించారు.

Leave a Reply