Global Star | చరణ్‌, భన్సాలీ ప్రాజెక్ట్ ఏమైంది…?

Global Star | చరణ్‌, భన్సాలీ ప్రాజెక్ట్ ఏమైంది…?

Global Star | చరణ్‌ ప్లేస్లో ధనుష్‌…?
అందుకనే.. నో చెప్పాడా..?
భన్సాలీ నిర్మాత మాత్రమే..

Global Star | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆర్ఆర్ఆర్ మూవీతో.. చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. దీంతో చరణ్ కి మాంచి క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ మేకర్స్ అయితే.. చరణ్‌ తో సినిమా చేయాలని అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ (Bollywood) బడా ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ చరణ్‌ తో మూవీ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో హీరో మారాడని.. కోలీవుడ్ స్టార్ హీరోతో ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..? చరణ్‌ చేయాల్సిన పాత్రను చేస్తుంది ఎవరు..?

Global Star | చరణ్‌ ప్లేస్లో ధనుష్‌…?

రామ్ చరణ్‌, సంజయ్ లీలా భన్సాలీ.. ఈ క్రేజీ కాంబోలో ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. చరణ్‌ కోసం భన్సాలీ హిస్టారికల్ జంగిల్ అడ్వెంచర్ డ్రామా రెడీ చేశారని టాక్ వినిపంచింది. త్వరలో ఈ క్రేజీ కాంబో మూవీని అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. రామ్ చరణ్ స్థానంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ను తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Global Star

Global Star | అందుకనే.. నో చెప్పాడా..?

రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీ జూన్ 25న రిలీజ్ (Release) కానుంది. ఆతర్వాత చరణ్‌.. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఈ సినిమా పూర్తవ్వడానికి టైమ్ పడుతుంది. ఈ మూవీ తర్వాత భన్సాలీతో సినిమా చేయడం అంటే లేట్ అవుతుంది. అందుకనే.. చరణ్‌ నో చెప్పాడా..? లేక కథ నచ్చకపోవడం వలన నో చెప్పాడా..? అనేది బయటకు రాలేదు కానీ.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే.. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంత వరుకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. దీంతో ప్రచారంలో ఉన్నది నిజమేనా..? లేక గాసిప్పా..? అనేది తెలియాల్సివుంది.

Global Star

Global Star | భన్సాలీ నిర్మాత మాత్రమే..

అయితే.. ఈ భారీ చిత్రంకి సంజయ్ లీలా భన్సాలీ నిర్మాత మాత్రమే.. దర్శకత్వం మాత్రం వేరే డైరెక్టర్ కి ఇవ్వనున్నారని టాక్. ధనుష్ తో ప్రాజెక్ట్ లాక్ అయ్యిందని.. ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యతను తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కి ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అభిమన్యుడు, సర్దార్ చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మిత్రన్‌కు హిందీలో ఇదే తొలి సినిమా (Movie) కానుంది. అడవి నేపథ్యంలో సాగే ఈ పౌరాణిక గాథలో ధనుష్ ఇప్పటి వరకు కనిపించని ఓ డిఫరెంట్ రోల్లో కనిపిస్తాడని.. ఇది ధనుష్ కెరీర్ లో బిగ్ ప్రాజెక్ట్ అవుతుందని కోలీవుడ్ టాక్. మరి.. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Global Star

CLICK HERE TO READ

CLICK HERE TO READ MORE Anjali| హీరోయిన్ అంజ‌లి క్యూట్ ఫోజులు

Leave a Reply