26acres | ‘ఉస్మానియా’కు.. కొత్త రూపు..

26acres | ‘ఉస్మానియా’కు.. కొత్త రూపు..

గోషామహల్ స్టేడియంలో చురుగ్గా పనులు
26 ఎకరాలలో 14 అంతస్తులతో నిర్మాణం
రెండేళ్లలో అందుబాటులోకి రానున్న అత్యాధునిక ఆస్పత్రి
2వేల పడకలు,. 29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు,
హెలిప్యాడ్, రోబోటిక్ సర్జరీ థియేటర్లు, అవయమార్పిడి యూనిట్లు,
బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు
26acres | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉస్మానియా ఆస్పత్రి .. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నిజాం కాలంలో నిర్మించిన ఈ ఆస్పత్రి దశాబ్దాలుగా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వస్తోంది. అయితే ఆస్పత్రిని నిర్మించి చాలా ఏళ్లు కావొస్తుండటంతో.. భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉండగా తాజాగా ఆ దిశగా అడుగులు పడ్డాయి.
గోషామహల్ స్టేడియంలో సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆస్పత్రి భవనాలు నిర్మించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 31న దీనికి శంకుస్థాపన చేశారు.
26acres | వేగంగా ఆస్పత్రి నిర్మాణ పనులు..
ప్రస్తుతం కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో 14 అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 22.96 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించే ఈ అసుపత్రిలో రోగుల రద్దీకి అనుగుణంగా 2వేల పడకలను ఏర్పాటుచేస్తున్నారు. 29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు, హెలిప్యాడ్, రోబోటిక్ సర్జరీ థియేటర్లు, అవయమార్పిడి యూనిట్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఆధునిక హంగులతో నిర్మిస్తున్నారు.
ఆస్పత్రిలో నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు వేర్వేరుగా నిర్మిస్తున్నారు.దీంతో పాటు హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 18 అప్రోచ్ రోడ్లు అవసరమవుతుండటంతో అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దం చేశారు.
26acres | 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యం..
2027 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మే 1వ తేదీన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తిస్థాయి ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌ను సమర్పించనుండగా, మే 10లోపు మెడికల్ డిపార్ట్‌మెంట్ ఫ్లోర్ ప్లాన్‌ను ఖరారు చేయనుంది. ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ వారం రోజుల్లో సవరించిన డిజైన్లను అందించనున్నారు. మే 20 నాటికి విద్యుత్ లైన్ల తరలింపు, జూన్ 1 నాటికి జీహెచ్‌ఎంసీ ద్వారా భూసేకరణ ప్రక్రియ పూర్తికానున్నాయి.
ప్రస్తుతం ప్రధాన భవన పునాది పనులు తుది దశకు చేరుకోగా, బేస్‌మెంట్ స్లాబ్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ప్రతి భవనాన్ని 12 అంతస్తులుగా నిర్మించబోతున్నారు. 2,000 పడకల సామర్థ్యం దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతి భవనం బేస్‌మెంట్‌లో రెండు అంతస్తుల పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

CLICK HERE TO READ MORE : 32years | సమష్టి కృషితోనే.. డీజీపీ స్థాయికి
