minimum10k | విమాన‌యానం..ప్రియం స్పీడ్ పెట్రోల్ ధరలు పెర‌గ‌డ‌మే కార‌ణం

minimum10k | విమాన‌యానం..ప్రియం స్పీడ్ పెట్రోల్ ధరలు పెర‌గ‌డ‌మే కార‌ణం

minimum10k | భరించలేమంటున్న విమానయాన సంస్థలు
ఖర్చు తగ్గించుకునే పనిలో కంపెనీలు
గణనీయంగా ప్రయాణ చార్జీలు పెంపు
తక్కువ దూరం ప్రయాణానికి రూ.10 వేలు పెట్టాల్సిందే
ఇక విదేశీ ప్రయాణం అంటే రూ.లక్షలే..

minimum10k న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు నేల మీద మాత్రమే కాదు, ఆకాశంలో ప్రయాణించే సామాన్యుడి జేబుకు కూడా చిల్లు పెడుతున్నాయి. చమురు ధరల పెరుగుదల వల్ల విమానయాన రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి చమురు సరఫరాను దెబ్బతీశాయి. దీనివల్ల విమానాల్లో వాడే జెట్ ఇంధనం ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. యుద్ధం ప్రారంభం కాకముందు టన్నుకు $831 ఉన్న ధర, ఇప్పుడు $1,838 కు చేరుకోవడం సంస్థలను దిగ్భ్రాంతికి గురి చేసింది. విమాన నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 30 శాతం వాటా కేవలం ఇంధనానిదే కావడం వల్ల, భారాన్ని విమానయాన సంస్థలు నేరుగా ప్రయాణికులపైనే వేస్తున్నాయి.

ప్రయాణికులపైనే భారం

minimum10k
minimum10k

టికెట్ బాదుడు ఇంధన ధరల పెరుగుదల ప్రభావం టికెట్ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో విమాన ప్రయాణం సామాన్యులకు భారం అవుతోంది. అమెరికాలో దేశీయ విమాన చార్జీలు ఏడాది కాలంలోనే 18 శాతం పెరిగి సగటున $358 కు చేరుకున్నాయి. విదేశీ ప్రయాణాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సగటు టికెట్ ధర సుమారు $115 పెరిగి $1,064 మార్కును దాటింది. అంటే విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఇప్పుడు తమ బడ్జెట్‌ను భారీగా పెంచుకోవాల్సి వస్తోంది. దేశీయంగా సరాసరి విమాన టికెట్‌ ధర 40 శాతానికి పైగా పెంచినట్టు సమాచారం. అంతర్జాతీయ రూట్‌లో అయితే ఏడాది క్రితం రూ.52 వేలుగా ఉన్న టికెట్‌ ధర ప్రస్తుతం రూ.75 వేలకు పైగా చేరుకున్నది. అంటే ఇంచుమించు 40శాతానికి పైగా సవరించాయి. అలాగే గతేడాది రూ.5,850గా ఉన్న సరాసరి దేశీయ విమాన టికెట్‌ ధర ప్రస్తుతం రూ.8,450కి చేరుకున్నది. సరాసరి దేశీ బుకింగ్‌ విలువ ఏడాది క్రితం రూ.8,500 నుంచి రూ.9,500 వరకు ఉండగా, ప్రస్తుతం ఇది రూ.9 వేల నుంచి రూ.10 వేలకు చేరుకున్నాయి.

విమానయాన సంస్థల వ్యూహాలు

ఖర్చులను తగ్గించుకోవడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జర్మనీకి చెందిన లుఫ్తానా దిగ్గజ సంస్థ ఈ వేసవిలో 20,000 స్వల్ప-దూర విమానాలను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల యూరప్ దేశాల మధ్య ప్రయాణించే వారికి ఎంపికలు తగ్గిపోయాయి. ఈ సంస్థ కూడా తన విమాన సర్వీసులను 5శాతం మేర తగ్గించింది. టికెట్ ధరలు పెంచడమే కాకుండా, సామాను రుసుంలను కూడా పెంచడం ద్వారా కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ప్రస్తుతానికి కొన్ని విమానయాన సంస్థలు ‘ఇంధన హెడ్జింగ్’ ద్వారా స్వల్పకాలిక గండం నుంచి గట్టెక్కుతున్నాయి. కానీ యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే ఈ వ్యూహాలు కూడా పని చేయవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విమాన టికెట్ల అధిక ధరల వల్ల ప్రజలు ముందస్తు బుకింగ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే ప్రయాణాల్లో విలాసాల కంటే ‘బడ్జెట్-చేతన’ నిర్ణయాలు తీసుకోవడం పెరిగింది. ప్రపంచ వాణిజ్యం, ప్రయాణ రంగాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు ఎంతలా లోనవుతాయో ఈ పరిస్థితి మరోసారి నిరూపించింది. రాబోయే నెలల్లో విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. ప్రయాణికులు తమ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవడం, వీలైనంత వరకు ‘ఫ్లెక్సిబుల్ బుకింగ్’ ఆప్షన్లను ఎంచుకోవడం మంచిది. యుద్ధం ముగిసి చమురు ధరలు అదుపులోకి వచ్చే వరకు ఆకాశ ప్రయాణం సామాన్యుడికి అందనంత ఎత్తులోనే ఉండేలా కనిపిస్తోంది.

ఎయిర్‌లైన్స్‌లకు అండగా..

నష్టాలతో నడుస్తున్న విమానయాన సంస్థలకు అండగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. ఇంధన ధరాభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్రం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. ధరలపై ఉన్న నియంత్రణను స్వల్పంగా ఎత్తివేసింది. 60 శాతం ఉచిత సీట్ల కేటాయింపును రద్దు చేసింది. అలాగే ఏటీఎం సర్‌చార్జీని విధించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. మొత్తం నిర్వహణలో 60 శాతం ఇంధనం కోసం వెచ్చిస్తున్న సంస్థలకు రూపాయి పతనం కూడా ఈ నష్టాలను మరింత పెంచింది.

కొన్ని రూట్లలో చార్జీల వివరాలు

ఢిల్లీ-వారణాసిల మధ్య అత్యవసర బుకింగ్‌ రూ.10,500 నుంచి రూ.14,500గా ఉంది. అడ్వాన్స్‌ బుకింగ్‌ రూ.4,600 నుంచి రూ.5,500 మధ్యలో..

ఢిల్లీ-బెంగళూరుల మధ్య టికెట్‌ ధర రూ.10,500 నుంచి రూ.14 వేల మధ్యలో. 15 రోజుల ముందు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటే రూ.7,200-8,500 మధ్యలో..

ముంబై-చెన్నై మధ్యలో అత్యవసరంగా బుకింగ్‌ చేసుకుంటే రూ.8,200 నుంచి రూ.10,500 మధ్యలో. అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటే రూ.4,400 నుంచి రూ.5,200 మధ్యలో..

ముంబ‌యి-ఢిల్లీ రూట్‌లో రూ.9,500 నుంచి రూ.12,800 మధ్యలో ఉన్నది. అడ్వాన్స్‌గా బుకింగ్‌ చేసుకున్నవారికి రూ.5,800 నుంచి రూ.7,100 మధ్యలో..

బెంగళూరు-ముంబై మధ్యలో ప్రస్తుతం రూ.8,400 నుంచి రూ.11,200 మధ్యలో ఉన్నది. పక్షం రోజుల ముందు బుకింగ్‌ చేసుకుంటే రూ.4,900 నుంచి రూ.6,300 మధ్యలో..

click here to read భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ముప్పు

click here to read more

Leave a Reply