Anjali| హీరోయిన్ అంజ‌లి క్యూట్ ఫోజులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : యంగ్ హీరోయిన్ అంజలి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం అక్కర లేదు. గత కొన్ని రోజులుగా కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులు పోగోడుతోంది. తెలుగులో క్రేజీ హీరోయిన్. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెప్పించింది. విభిన్న కంటెంట్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అంజలి. నిజానికి తెలుగమ్మాయే అయినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. నటిగా ప్రశంసలు సొంతం చేసుకుంది.

షాపింగ్ మాల్ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో తెరంగేట్రం చేసిన అంజలి.. తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత జర్నీ సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేశ్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

అంజలి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం అక్కర లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లోను నటిస్తూ అదరగొడుతోంది. షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన తెలుగందం అంజలి. తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. ఒక‌ప్పుడు బొద్దుగుమ్మ‌లా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు చాలా సన్నబడి.. అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులు పోగోడుతోంది. ఈ నేపథ్యంలోనే తన ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకుంది.