లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రండి

లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రండి
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు ఆలయ ఈవో
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరుకా వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు ప్రత్యేక ఆహ్వాన పత్రికను మండలంలోని పెద్ద కౌకుంట్ల గ్రామంలో సోమవారం అందించారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ధర్మకర్తల మండలి చైర్మన్ రేగాటి నాగరాజు, దేవస్థానం కార్యనిర్వహణా ధికారి సాకే రమేష్ బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు వేద పండితులు మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం తరఫున ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రచురించిన బుక్ లేట్ ను మంత్రి కేశవ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేశవ్ కు వేద ఆశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ అత్యంత సానుకూలంగా స్పందిస్తూ, మహా రథోత్సవంలో తప్పకుండా పాల్గొని, స్వామివారి సేవలో భాగ్య స్వామి అవుతానని హామీ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులను విస్తృతంగా నిరంతరాయంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రత్యేకంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, భక్తులకు సమృద్ధిగా త్రాగునీరు అందించుటకు ట్యాంకర్ల ద్వారా విస్తృతంగా నీటి సరఫరా చేయాలని, ఈ దశగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో భాగ్యస్వాము లు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మీనుగ రామకృష్ణ, ధనుంజయ ఆచారి, ఇంద్రావతి సుధాకర్, అర్చకులు ద్వారకనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
