ఉరవకొండలో గర్భిణి ఆత్మహత్య..

  • కుటుంబంలో విషాదం..
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ మండలం షేక్ షాన్‌పల్లి తండాలో ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన సుంకమ్మ (28) అనే గర్భిణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.