ఖరీఫ్-2026 పంటల ప్రణాళికపై సమావేశం..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఈనెల 29వ తేదీ నుండి 30 తేదీ వరకు నంద్యాలలోని డాక్టర్ వైయస్సార్ సెంటెనరీ హాల్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. ఈ కౌన్సిల్లో అత్యల్ప వర్షపాతం జోన్ పరిధిలోని జిల్లాలైన అనంతపురం, శ్రీ సత్య సాయి, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన ఆయా పరిశోధన స్థానాల నుంచి శాస్త్రవేత్తలు, ఉద్యానవన శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, రైతు సోదరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఈ కౌన్సిల్ సమావేశంలో ముందస్తు ఖరీఫ్ 2026 పై పంటల ప్రణాళిక, సాగు విస్తీర్ణం మరియు ఆహార ఉత్పత్తులు పెంచడం అనే అంశాలపై గురించి విపులంగా చర్చించడం జరుగు తుందన్నారు. రాబోయే ఖరీఫ్ 2026 ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితు లను ఏ విధంగా ఎదుర్కోవాలి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ను రైతుల్లోకి తీసుకుని వెళ్లాలి తద్వారా వర్షాభావం, కరువు ఎదురైన సాంకేతికతో ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశాలపై సుదీ ర్ఘమైన చర్చ జరుగుతుందన్నారు. జిల్లా లోని అన్ని వ్యవసాయ సబ్ డివిజన్స్ నుండి సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ వారు ప్రాతినిధ్యం వహిస్తారు. ఉరవకొండ వ్యవసాయ సబ్ డివిజన్ నుంచి ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ పాల్గొంటున్నారు.

Leave a Reply