సెలవులలో క్లాసులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

సెలవులలో క్లాసులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

  • ఎస్ఎఫ్ఐ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిన వేసవి సెలవులను అమలు చేయకుండా విద్యార్థులను బలవంతంగా తరగతులకు హాజరుకావాలని ఒత్తిడి చేస్తున్నాయని ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 24 ఏప్రిల్ 2026 నుండి 1 జూన్ 2026 వరకు వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, గుడ్ షెఫర్డ్ స్కూల్ (విఠల్ నగర్), ప్రతిభ స్కూల్ (కల్లూరు), ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ (విద్యా నగర్), శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ (బిర్లగట్), నారాయణ జూనియర్ కాలేజ్ (రాజ్ విహార్ సెంటర్) వంటి విద్యాసంస్థలు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా తరగతులు నిర్వహిస్తున్నాయి.

ఈ సమస్యపై అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం. రంగప్ప, నగర అధ్యక్షుడు ఆర్యన్ మాట్లాడుతూ… ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో విద్యార్థులను బలవంతంగా విద్యాసంస్థలకు రప్పించడం వారి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవులను అమలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలు, కళాశాలల తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, మెయిన్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply