ఫెస్టిసైడ్స్ డీలర్స్కు ఇబ్బందులు
కంపెనీ పై చర్యలు తీసుకోవాలి
కరీమాబాద్ ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ)ది వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర బంద్ కు మద్దతు ఇస్తా ఉన్నాం… డీలర్లు ఎదుర్కొనే సమస్యల నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బంధు నిర్వహిస్తాము..ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏ ఇవ్వకుండా డీలర్లను ఇబ్బంది పెడుతున్నారనీ ఆయన అన్నారు.266 రూపాయలు ఎమ్మార్పీ ఉంది. అమ్మ వలసిన యూరియా 300 వరకు పెరుగుతున్నాయి..ప్రభుత్వానికి సప్లై చేసిన ఎరువుల కంపెనీలు ఎఫ్ఓఏలు ఇస్తున్నాయనీ అన్నారు.ప్రవేట్ డీలర్స్ సప్లై చేసే వాళ్లకు ఎఫ్ఓఏలు ఇవ్వడం లేదు..డీలర్స్ ని ఇబ్బంది పెట్టె కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం..అవసరం లేని లింక్ ప్రోడక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎరువుల కంపెనీలో సరైన నిర్ణయం తీసుకోపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత బంద్ ను ఉదృతం చేస్తాం. అని వెంకన్న పేర్కొన్నారు.
తెలంగాణలో వ్యవసాయ రంగంలో ముందు స్థాయిలో ఉండడానికి డీలర్స్ కృషి చేస్తున్నాం. అని అన్నారు. ప్రభుత్వం వెంటనే డీలర్ల ఇబ్బందులపై దృష్టి సారించి సమస్యలు పరిష్కానికి కృషి చేయాలనీ అన్నారు. శివనగర్ నుండి బంధు విజయవంతం కొరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఫర్టిలైజర్ అసోసియేషన్, సీడ్స్ అండ్ డీలర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
