Missing Woman | ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేసిన మాజీ మేయర్

Missing Woman | ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేసిన మాజీ మేయర్

Missing Woman | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తన సోదరి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫిర్యాదు ప్రకారం, బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో నివసించే ఆమె సోదరి కె. నమ్రత (57) ఈ నెల 4వ తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో సతీష్ (35), సత్యనారాయణ (45), కుమారి (45) అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు గద్వాల విజయలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.