29 న వాహనాల వేలం పాట

29 న వాహనాల వేలం పాట
లక్షేట్టిపేట, (ఆంధ్ర ప్రభ ) : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లక్షెట్టిపేట్ పరిధిలో వివిధ కేసులలో జప్తు చేయబడిన పలు ద్వి, త్రిచక్ర వాహనములకు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు గంటలకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి మంచిర్యాల్ సమక్షంలో లక్షెట్టిపేట్ నందు బహిరంగ వేలం నిర్వహించబడునని ఎక్సజ్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు 29న బహిరంగ వేలంలో తగిన ధరావత్తు సొమ్ము చెల్లించి పాల్గొనవచ్చునన్నారు.
ఇతర పూర్తి వివరాలకు లక్షెట్టిపేట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
