హనుమాన్ గుడి నిర్మాణానికి రూ.1.11 లక్షల విరాళం..

హనుమాన్ గుడి నిర్మాణానికి రూ.1.11 లక్షల విరాళం..
- దాతలను అభినందించిన సర్పంచ్ బనీషా నాయక్
- మియాపూర్‌లో చెక్కు అందజేత
రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని సూర్య తండా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు పెద్ద మనసుతో విరాళాలు అందజేశారు. కొండాపూరం గ్రామానికి చెందిన కీ.శే. అట్టెపల్లి లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం అయన కుమారులు అట్టెపల్లి పురుషోత్తం, అట్టెపల్లి రాంప్రభు లు మియాపూర్‌లోని తమ నివాసంలో రూ.1,01,100 విరాళాన్ని అందించారు. అలాగే అట్టెపల్లి శ్రీరాములు రూ.10,116 విరాళంగా ఇచ్చారు.
సూర్య తండా సర్పంచ్ మునావత్ బనీషా నాయక్, ఉపసర్పంచ్ శంకర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు హమ్యనాయక్, బి ఆర్ ఎస్ నాయకుడు జాజునాయక్, గ్రామస్తులు నారాయణ, రవి, విజయ్, శ్రీను తదితరులు మియాపూర్ వెళ్లి దాతల నుంచి చెక్కులను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బనీషా నాయక్ మాట్లాడుతూ.. “గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కోసం తమ తండ్రిగారి జ్ఞాపకార్థం విరాళం అందించిన అట్టెపల్లి పురుషోత్తం, రాంప్రభులకు, శ్రీరాములు కి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వారి దాతృత్వం గ్రామాభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో తోడ్పడుతుంది” అని కొనియాడారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఉపసర్పంచ్ శంకర్ నాయక్ తెలిపారు. దాతల సహకారంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందని గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ గ్రామ పంచాయతీ పాలకవర్గం ధన్యవాదాలు తెలిపింది.
