నాలుగు కోట్ల గొంతుకలను ఏకం చేసిన ఉద్యమ పార్టీ
వాడవాడలా జెండాలను ఎగురవేసిన నాయకులు
నర్సంపేట, ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ ) : నాలుగు కోట్ల గొంతుకలను ఏకం చేసిన ఉద్యమ పార్టీ బిఆర్ ఎస్ పార్టీ అని పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ అన్నారు.బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నర్సంపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమర వీరుల స్తూపం వద్ద ఘనంగా జెండా నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బిఆర్ ఎస్ పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ జెండా ఆవిష్కరించిన సీట్లు పంచారు.
ఈసందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ రవీందర్ రావు వేణులు మాట్లాడుతూ…. సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక అన్నారు. పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ సేనా అన్నారు. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం గులాబీ పార్టీ మరోసారి జెండా ఎగురవేయాలని అభిలషించారు.
రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి అని నినాదించారు. ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్‌ఎస్ అని వారు పేర్కొన్నారు. డివిజన్ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాన గులాబి జెండాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ శివరాత్రి స్వామి, మండల శ్రీనివాస్, నామాల సత్యనారాయణ, లెక్కల విద్యాసాగర్ రెడ్డి, పైసా ప్రవీణ్, సాలయ్య, దొమ్మాటి సంతోష్ తోపాటు వివిధ అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.
