భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణ చేద్దాం…

భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణ చేద్దాం…
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్..
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : భగీరథ మహర్షీ స్ఫూర్తితో జిల్లాలో జల సంరక్షణను చేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహనీయుడని కొనియాడారు.
గంగను భూమికి తీసుకురావడానికి ఆయన కఠోర తపస్సు చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
