శాకాంబరి అవతారంలో కొత్తమ్మతల్లి దర్శనం
- అమ్మ కృపకోరి పోటెత్తిన భక్తులు
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ: ఆషాడ మాసంలో తొలి గురువారం, పూరి జగన్నాథుని రథోత్సవం పర్వదినం, తదియ తిధి పురస్కరించుకొని దేవాదాయ శాఖ పరిధిలోని స్థానిక శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారు శాకాంబరి అవతారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైన రోజు అయినందున ఆలయ ఈవో వాకచర్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు 30 రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేసి భక్తులకు దర్శనం భాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి సుమారు 600 మంది భక్తులు వచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. వీరికి అన్నప్రసాదం వితరణ చేసినట్లు ఈవో తెలిపారు.
